గ్రూప్-2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరుతూ నేడు బీఎస్పీ నేత డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొ కోదండరాం తెలంగాణ అమర వీరుల స్థూపం, గన్ పార్క్ వద్ద శాంతియుత సత్యాగ్రహనికి పిలుపునిచ్చిన నేప‌ధ్యంలో బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం వ‌ద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

గ్రూప్-2 పరీక్ష(Group-2 Exam)ను మూడు నెలలు వాయిదా(Postpone) వేయాలని కోరుతూ నేడు బీఎస్పీ నేత డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar), ప్రొ కోదండరాం(Prof Kondaram) తెలంగాణ అమర వీరుల స్థూపం, గన్ పార్క్ వద్ద శాంతియుత సత్యాగ్రహనికి పిలుపునిచ్చిన నేప‌ధ్యంలో బీఎస్పీ రాష్ట్ర కార్యాలయం(BSP State Office) వ‌ద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం(Tense Atmosphere) నెల‌కొంది. గ్రూప్-2 అభ్య‌ర్థులు పెద్ద ఎత్తున కార్యాల‌యం వ‌ద్ద‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు(Police) భారీగా మొహరించారు. సుమారు 100 మంది పోలీసులు కార్యాల‌యం చుట్టుముట్టారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టు(Arrest)కూ రంగం సిద్ధమైంది. ప్రవీణ్ కుమార్ ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఆయ‌నను బ‌య‌ట‌కు వెళ్ళకుండా ఆపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ విష‌య‌మై ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ(TSPSC) ఆధ్వర్యంలో ఆగస్టు 29,30 తేదీల‌లో జరగబోయే గ్రూప్-2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని శ‌నివారం తాను, ప్రొ కోదండరాం, ఇత‌ర మేధావులు, సామాజిక ఉద్యమకారులం అందరం తెలంగాణ అమర వీరుల స్థూపం(Telangana Amara Veera Stupam), గన్ పార్క్(Gun Park) వద్ద శాంతియుతంగా సత్యాగ్రహం చేయబోతున్నం. ఇది ఎవరి మీదనో కోపంతోనో, పంతం నెగ్గించుకోవాలనో చేస్తున్న దీక్ష కాదు. కేవలం తెలంగాణ(Telangana)లో 5.75 లక్షల అభ్యర్థుల గుండె చప్పుడును పాలకులకు చేరవేసి తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగేలా చూసే ప్రయత్నమే. అనవసరంగా ఆంక్షలు పెట్టకండని ప్ర‌భుత్వాన్ని అభ్య‌ర్ధించారు.

Updated On 11 Aug 2023 10:30 PM GMT
Yagnik

Yagnik

Next Story