తెలంగాణ(Telangana)లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మండుతున్న ఎండలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం.
తెలంగాణ(Telangana)లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మండుతున్న ఎండలు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా(Nalgonda District) బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాల్లో(Nirmal District) 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయంటే వేసవి కాలం ఎంత ప్రమాదకరంగా ఉండబోతున్నదో అర్థమవుతోంది. రాబోయే అయిదు రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. రాబోయే అయిదు రోజులలో ఉష్ణోగ్రతలు కనీసం రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హైదరాబాద్(Hyderabad)లోనూ రానున్న అయిదు రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందట! మే మాసం ఆరంభంలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకోవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది.