ప్రముఖ జానపద గాయకుడు(Folk Singer) వడ్డేపల్లి శ్రీనివాస్‌(Vaddepalli Srinivas ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా(Health issue) బాధపడుతున్న శ్రీనివాస్‌ ఇటీవలే ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్‌ య్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ చిలకలగూడలోని ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.

ప్రముఖ జానపద గాయకుడు(Folk Singer) వడ్డేపల్లి శ్రీనివాస్‌(Vaddepalli Srinivas ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా(Health issue) బాధపడుతున్న శ్రీనివాస్‌ ఇటీవలే ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్‌ య్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ చిలకలగూడలోని ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించి చనిపోయారు. వడ్డేపల్లి శ్రీనివాస్‌ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పాట గబ్బర్‌సింగ్‌లోని పిల్లా నువ్వులేని జీవితం. ఆ పాట సూపర్‌డూపర్‌ హిట్టయ్యింది. శ్రీనివాస్‌కు ఎంతో పేరు తెచ్చింది. చాన్నళ్ల పాటు ఈ పాట మారుమోగింది. నాగార్జున నటించిన కింగ్ సినిమాలో, రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమాలో, నమస్తే అన్న అనే తదితర సినిమాల్లో పాటలు పాడారు వడ్డేపల్లి శ్రీనివాస్.

Updated On 29 Feb 2024 6:15 AM GMT
Ehatv

Ehatv

Next Story