తెలంగాణలో(Telangana) మరో నెలరోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) తెలుగుదేశం పార్టీ(TDP) పోటీ చేయడం లేదు. ఇదేం షాకిచ్చే వార్త కాదు. టీడీపీ ఇక్కడ పోటీ చేయదన్న విషయం రాజకీయాలపట్ల కొంచెం అవగాహన ఉన్నవారికి కూడా తెలిసిపోయింది. ఎంత దురవస్థ? ఇంత పతనాన్ని ఎవరైనా ఊహించారా?

తెలంగాణలో(Telangana) మరో నెలరోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) తెలుగుదేశం పార్టీ(TDP) పోటీ చేయడం లేదు. ఇదేం షాకిచ్చే వార్త కాదు. టీడీపీ ఇక్కడ పోటీ చేయదన్న విషయం రాజకీయాలపట్ల కొంచెం అవగాహన ఉన్నవారికి కూడా తెలిసిపోయింది. ఎంత దురవస్థ? ఇంత పతనాన్ని ఎవరైనా ఊహించారా? నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఈసారి పోటీ చేయడం లేదంటే తెలంగాణలో ఆ పార్టీ దుకాణం సర్దేసినట్టే అనుకోవాలి. మొన్నటి వరకు తెలంగాణలో ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రమే అనుకున్నాం కానీ.. మరీ ఈ స్థాయికి దిగజారుతుందని, అదీ ఇంత త్వరగా అని ఎవరూ ఊహించలేదు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెద్దగా గెలిచిందంటే అది 1999 ఎన్నికల్లోనే! ఇప్పుడు తెలంగాణలో కేవలం తెలుగుదేశం భవన్‌(Telugu desham bhavan) మాత్రమే మిగిలింది. టీడీపీ కాలగర్భంలో కలిసిపోయిందనే చెప్పుకోవచ్చు. తెలంగాణలో తడాఖా చూపిస్తామని బాలకృష్ణ(Balakrishna) చెప్పి నాలుగు వారాలు కూడా కాలేదు.. తెలంగాణలో తామే అధికారంలో వస్తామని అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరి(Kasani Gnaneswar) చెప్పి వారం కాలేదు. ఇంతలోనే పార్టీకి షట్టర్లు ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది? ఆరు నెలల కిందట ఖమ్మం బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారో గుర్తుంది కదా! పాత టీడీపీ వారంతా వచ్చేయండి.

మనం పవర్‌లోకి రాబోతున్నామని చెప్పారు కదా! ఏమైందా పవర్‌? ఆఖరి పెద్ద నాయకుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పరిసమాప్తమయ్యింది. తెలంగాణలో టీడీపీ లేకపోవచ్చు కానీ ఆ పార్టీకి పంపు కొట్టే మీడియా మాత్రం ఉంది. తెలంగాణలో పోటీకి దూరంగా ఉండటం కూడా చంద్రబాబు చాణక్యమేనని రాసినా రాస్తాయి. సుమారు నాలుగు దశాబ్దాల కిందట తెలంగాణలో పుట్టిన ఆ పార్టీ తెలంగాణలో అంతరించిపోవడం బాధాకరమే!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడి ప్రజలు టీడీపీని అంధ్రా పార్టీగా భావించారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ 2014లో జరిగిన ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ పది సీట్లలో గెలిచింది. కానీ గమ్మున ఉండకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రకు పాల్పడింది. ఆ ఓటుకు నోటును టీఆర్‌ఎస్‌ తన ఎదుగుదలకు చక్కగా ఉపయోగించుకుంది.

ఇక 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌(Congress)- తెలుగుదేశంపార్టీ కూటమి ఘనవిజయం సాధించబోతున్నదని టీడీపీ అనుకూల మీడియా ఊదరగొట్టింది. క్యాబినెట్‌లో ఎవరెవరు ఉండబోతున్నారంటూ పేర్లు కూడా ప్రకటించింది. పాపం చంద్రబాబు(Chandrababu) అయితే కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాలన్నీ తిరిగారు. తీరా టీడీపీ గెలిచిన సీట్లు రెండంటే రెండే! అది కూడా ఖమ్మం జిల్లాలోనే! తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్‌లో టీడీపీ గెల్చింది ఒక్కటంటే ఒక్కటి! పుష్కరకాలం కిందట వరకు కళకళలాడిన తెలుగుదేశం భవన్‌ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది.

ఇప్పుడు తెలంగాణలో పోటీ చేసే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదన్నది నిర్వివాదాంశం. మరో ఆరు నెలలలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే పార్టీకి మనుగడ. లేకపోతే అంతే! జీవన్మరణ పోరాటం అంటారే! అలాంటిదన్నమాట! ఇప్పుడు తెలంగాణలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల్చుకోకుండా డిపాజిట్లు కూడా కోల్పోతే అంతకు మించిన పరాభవం ఆ పార్టీకి ఉండదు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. అదీ కాకుండా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉన్నది రేవంత్‌రెడ్డి! ఎంతకాదనుకున్నా ఆయన చంద్రబాబుకు ప్రియ శిష్యుడు. రేవంత్‌ ముఖ్యమంత్రి అయితే ఆ పదవిలో తను ఉన్నట్టేనన్నది చంద్రబాబు భావన కావచ్చు. అందుకే కమ్మ సామాజికవర్గం వారంతా ఈసారి కాంగ్రెస్‌కు వేయాలనుకుంటున్నారట! అలాగని టీడీపీ అనుకూల మీడియా రాస్తోంది.

కేసీఆర్‌(KCR) కంటే రేవంత్‌(Revanth Reddy) అధికారంలో ఉంటేనే తనకు శ్రేయస్కరమన్నది బాబు ఆలోచన! మూడు నాలుగు శాతం ఓట్లో పోటీ చేసి పరాజయాన్ని మూటగట్టుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండటమే బెటరని చంద్రబాబు భావించి ఉంటారు. పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే బదులు తమ ఓట్లను కాంగ్రెస్‌కు బదాలాయించాలనే లక్ష్యంతో తెలంగాణలో దుకాణం సర్దేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనుకుంటాను నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఇక్కడ హిందీలో మాట్లాడే ప్రయత్నం చేశారు. మై తాతా బీ యహా రగ్తీతీ అంటూ ఏదోదో అన్నారు. ఇక్కడే తాను గాలిపటాలు ఎగరేశానని అన్నారు. ఇప్పుడు మై పార్టీ బీ యహా రగ్తీతీ .. పార్టీ గాల్లో కలిసిపోయిందీ హై! అని చెప్పుకుంటారేమో!

Updated On 31 Oct 2023 5:00 AM GMT
Ehatv

Ehatv

Next Story