☰
✕
మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీ పార్టీలో చేరారు. తాజాగా తెలుగు దేశం పార్టీ సభ్యత్వం బాబు మోహన్ తీసుకున్నాడు.
x
మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ టీడీపీ పార్టీలో చేరారు. తాజాగా తెలుగు దేశం పార్టీ(TDP) సభ్యత్వం బాబు మోహన్ తీసుకున్నాడు. మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ ఆందోల్(Andole) నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బాబు మోహన్ ఓ ఫోటోను విడుదల చేశారు. ఇది ఇలా ఉండగా గతంలో సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్(Babu Mohan) బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలోని తాజాగా పరిస్థితుల్లో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకి వెల్లడించారు. బీజేపీ(BJP) స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొంత కాలంగా పార్టీలో ఇమడలేకపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే నిర్ణయాన్ని తీసుకున్నారు.
ehatv
Next Story