తెలంగాణలో ఐటీ ఎగుమతులు(Telangana IT exports) ఏడేళ్ల కనిష్టస్థాయికి పడిపోయాయి.
తెలంగాణలో ఐటీ ఎగుమతులు(Telangana IT exports) ఏడేళ్ల కనిష్టస్థాయికి పడిపోయాయి. 2022-23లో ఐటీ ఎగుమతులు రూ 57,706 కోట్లు, 2023-24 - రూ. 26,948 కోట్లకు పడిపోయాయి. 7 ఏండ్ల కిందటి కనిష్ట స్థాయికి పడిపోయాయని నివేదికలు తేల్చాయి. అటు ఉద్యోగాల కల్పనలో కూడా ఈ ఏడాది చాలా దారుణంగా పడిపోయింది తెలంగాణ. ఉపాధి కల్పన 2022-23లో 1,27,594 ఉద్యోగ అవకాశాలు రాగా, 2023-24లో కేవలం 40,285 కొత్త ఉద్యోగాలే వచ్చాయి. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పన తరుగుదలపై కేటీఆర్ (KTR)ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన ఆరేడేళ్లలో తెలంగాణలో ఐటీ ప్రగతి గణనీయంగా సాగిందని ఆయన గుర్తు చేశారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో, ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ గొప్పగా సాగిందని, కానీ ప్రస్తుత పరిణామాలు ఆందోళనకంగా మారుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. మరీ ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. కొత్త ఐటీ ఉద్యోగాల కల్పన పడిపోయిందని, 2022-23 సంవత్సరంతో పోలిస్తే ఆ ఉద్యోగాల నియామకాలు మూడో వంతు పడిపోయినట్లు ఆయన వెల్లడించారు.