సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుందని చెప్పాలి.

సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుందని చెప్పాలి. సోషల్ మీడియాలో రిల్స్‌(Social media Reels) కోసం పాముతో విన్యాసాలు చేశాడు. విన్యాసాలు చేస్తూ వీడియో తీస్తుండగా అది కాటేయడంతో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా(KamaReddy)బాన్సువాడ(Banswada) మండలం దేశాయిపేట(Deshaipeata)లో శుక్రవారం జరిగింది. దేశాయిపేటకు చెందిన యువకుడు శివరాజు(Sivaraju)తన తండ్రి గంగాధర్‌(Gangadhar) ద్వారా పాములు పట్టే వృత్తిని నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ఈనెల 5న ఓ చోట నాగుపాము ఉందని స్థానికులు శివరాజ్‌కు ఫోన్‌ చేసి తెలపగా అక్కడికి చేరకున్నాడు. అక్కడ పామును పట్టుకొని చాలా సేపు దానితో విన్యాసాలు చేశాడు. పాము తలను నోట్లో పెట్టుకొని వీడియోలు తీపించుకున్నాడు. పాముతో విన్యాసాలు చేస్తుండగా అది చేతివేలిని కరిచింది. కుటుంబసభ్యులు బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శివరాజ్ మృతి చెందాడు.

ehatv

ehatv

Next Story