బంజారాహిల్స్ లోని యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పై సైబరాబాద్ పోలీసుల దాడులు నిర్వ‌హించిన‌ట్లు నాయ‌కులు చెబుతున్నారు. సైబరాబాద్ పోలీసులు విలువైన డేటాతోపాటు కంప్యూటర్లను ఎత్తుకెళ్లార‌ని ఆరోపిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పాత్ర అమోఘమని డీకే శివ కుమార్ ప్రశంసలు కురిపించార‌ని.. ఈ నేప‌థ్యంలోనే యువజన కాంగ్రెస్ పనితీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ హైరానా చెందుతున్నార‌ని అన్నారు.

బంజారాహిల్స్(Banjara Hills) లోని యువజన కాంగ్రెస్(Youth Congress) సోషల్ మీడియా వార్ రూమ్(Social Media War Room) పై సైబరాబాద్ పోలీసుల(Cyberabad Police)దాడులు నిర్వ‌హించిన‌ట్లు నాయ‌కులు చెబుతున్నారు. సైబరాబాద్ పోలీసులు విలువైన డేటాతోపాటు కంప్యూటర్ల(Computer)ను ఎత్తుకెళ్లార‌ని ఆరోపిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో(Karnataka Elections) యూత్ కాంగ్రెస్ పాత్ర అమోఘమని డీకే శివ కుమార్(DK Shivakumar) ప్రశంసలు కురిపించార‌ని.. ఈ నేప‌థ్యంలోనే యువజన కాంగ్రెస్ పనితీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) హైరానా చెందుతున్నార‌ని అన్నారు. హైదారాబాద్ యూత్ డిక్లరేషన్(Hyderabad Youth Declaration) ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న‌ వేళ కేసీఆర్ బంట్రోతులను ఉసిగొల్పార‌ని అంటున్నారు. సైబరాబాద్ పోలీసుల తీరును యూత్ అధ్యక్షుడు శివసేనారెడ్డి(Shivasena Reddy) తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ దొంగ నాటకాలు.. యూత్ కాంగ్రెస్ ను అడ్డుకోలేవని మండిప‌డ్డారు. పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాడులు చేయడం లాప్‌టాప్ లు ఎత్తుకెళ్లడం దుర్మార్గం.. చట్ట విరుద్ధం అని శివసేనారెడ్డి అన్నారు. కేసీఆర్ ఆగడాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరం లో లేవని అన్నారు.

Updated On 15 May 2023 10:21 PM GMT
Yagnik

Yagnik

Next Story