వినాయక చవితి(Vinayaka Chavithi) పండుగను ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై మరోసారి కాసింత అయోమయం నెలకొంది. భాద్రపద శుక్ల చతుర్థి అంటే 2023, సెప్టెంబర్ 18వ తేదీన సోమవారం రోజున పండుగ జరుపుకోవాలని తెలంగాణ(Telangana) విద్వత్సభ సూచిస్తోంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచే నవరాత్రుల(Navaratrulu)ను ప్రారంభించాలని విద్వత్సభ ప్రకటించింది.
వినాయక చవితి(Vinayaka Chavithi) పండుగను ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై మరోసారి కాసింత అయోమయం నెలకొంది. భాద్రపద శుక్ల చతుర్థి అంటే 2023, సెప్టెంబర్ 18వ తేదీన సోమవారం రోజున పండుగ జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ(Telangana vidvatsabha) సూచిస్తోంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచే నవరాత్రుల(Navaratrulu)ను ప్రారంభించాలని విద్వత్సభ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, అన్ని పీఠాలకు శాస్త్రబద్ధంగా నిర్ణయించిన పండగల జాబితాను విద్వత్సభ ఇస్తూ ఉంటుంది. వినాయక చవితిని సెప్టెంబర్ 18న జరుపుకోవాలా? లేకపోతే సెప్టెంబర్ 19న జరుపుకోవాలా? అన్నదానిపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో వంద మంది సిద్ధాంతుల సమక్షంలో జులై 22, 23న షష్ఠమ వార్షిక విద్వత్సమ్మేళనంలో చర్చించి వినాయక చవితి పండుగ తేదీపై ఓ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు భాగ్యనగర్ ఉత్సవ సమితి చవితి ఉత్సవాలపై ఓ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19వ తేదీన సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలని సూచించింది. అలాగే 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉందని, అయితే, ఈనెల 18వ తేదీన మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుందని, సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తామని, కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవితి జరుపుతున్నామని భాగ్యనగర్ ఉత్సవ సమితి తెలిపింది. ఈనెల 28వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది.