తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. హైదరాబాద్ తార్నాక‌లోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ పరీక్షా కేంద్రానికి అనుమతిచ్చేందుకు 50 వేలు లంచం తీసుకుంటూ శ‌నివారం రవీందర్ గుప్తా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

ఏసీబీ డీఎస్పీ సుద‌ర్శ‌న్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామ‌ని తెలిపారు. వీసీ ఇంట్లో 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికార‌ని వెల్ల‌డించారు. భీమ్ గల్ లో ఉన్న ఒక కళాశాల కు పరీక్ష కేంద్రం అనుమతి కోసం 50 వేలు లంచం డిమాండ్ చేశార‌ని పేర్కొన్నారు. నివాసం తో పాటు యూనివర్సిటీలో కూడా సోదాలు చేస్తున్నామ‌ని.. సోదాలు పూర్తి అయిన తర్వాత ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తామ‌ని తెలిపారు. గత వారమే రవీందర్ గుప్తాపైన ఆరోపణలు రావడం విశేషం. నియామకాల విషయంలో అవతవకలకు పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగం కూడా జరిగిందని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

Updated On 17 Jun 2023 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story