తెలంగాణలో(Telangana) ఎండలు ముదిరాయి. వసంతమే ఇంకా రాలేదు కానీ గ్రీష్మంలా ఎండలు మండిపోతున్నాయి. మార్చి మధ్యలోనే ఇంతేసి ఉష్ణోగ్రతలు(High Temparature) ఉంటే మే మాసంలో ఎలా అన్న ఆందోళన జనాల్లో మొదలయ్యింది. రెండు మూడు రోజుల నుంచి టెంపరేచర్లు బాగా పెరిగాయి.
తెలంగాణలో(Telangana) ఎండలు ముదిరాయి. వసంతమే ఇంకా రాలేదు కానీ గ్రీష్మంలా ఎండలు మండిపోతున్నాయి. మార్చి మధ్యలోనే ఇంతేసి ఉష్ణోగ్రతలు(High Temparature) ఉంటే మే మాసంలో ఎలా అన్న ఆందోళన జనాల్లో మొదలయ్యింది. రెండు మూడు రోజుల నుంచి టెంపరేచర్లు బాగా పెరిగాయి. మధ్యాహ్నం తీవ్రమైన వడగాలులు(Heat waves) వీస్తున్నాయి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ఎండ మాడు పగలగొడుతోంది. ఉదయం తొమ్మిది గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. మధ్యాహ్నం తీవ్రమైన ఉక్కపోత కారణంగా వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్చిలోనే రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వచ్చే వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాడు. ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతతో శరీరం పొడిబారడం, ఎర్రగా మారడం, తలవొప్పి, దురదలు, వాంతులు, స్పృహ కోల్పోవడం వంటివి జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. బ్లడ్ ప్రెషర్, షుగర్, గుండె జబ్బులు, చర్మవ్యాధులతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తతో ఉండాలి. వేసవిలో కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ లేదా ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు, చకెర కలిపిన నిమ్మరసం తీసుకుంటే శరీరానికి కావాల్సిన లవణాలు అందుతాయని అంటున్నారు. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు చేసేవారు సూర్యోదయానికి ముందే దాన్ని పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. మాంసాహారం జోలికి పోకపోవడం మంచిదంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య బయటకు వెళ్లకపోవటమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు.