తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. దీంతో అధికార కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి మహా లక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. దీంతో అధికార కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి మహా లక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రంలోని బాలికలు, అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఈ పథకం వర్తించనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. 9వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం పరిధిలోని TSRTC కి చెందిన పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఉత్తర్వులలో వెల్లడించింది.
మహిళా ప్రయాణికులు ప్రయాణించే వాస్తవ దూరం ఆధారంగా వసూలు చేయబడే ఛార్జీల మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం TSRTCకి రీయింబర్స్ చేస్తుందని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ మేరకు మహిళల ఉచిత ప్రయాణాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించింది.