తెలంగాణ(Telangana) మండిపోతున్నది. ప్రజలు అల్లాడిపోతున్నారు. భరణి కార్తెలో బండలు పగులుతాయంటారు. నిజంగానే బండలు పగులుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తెలంగాణలో చాలా చోట్ల 45 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలంగాణ(Telangana) మండిపోతున్నది. ప్రజలు అల్లాడిపోతున్నారు. భరణి కార్తెలో బండలు పగులుతాయంటారు. నిజంగానే బండలు పగులుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తెలంగాణలో చాలా చోట్ల 45 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిప్పుల పెనంలా మారిన తెలంగాణలో వేడిగాలు బలంగా వీస్తున్నాయి. ఆరేడు జిల్లాలు రెడ్‌జోన్‌లోకి వచ్చేశాయి. నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 45.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, వనపర్తి, జగిత్యాల జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. మిగతా జిల్లాలలో ఎండలు తక్కువేమీ లేదు. అక్కడా భరించలేని స్థాయిలో ఉష్ణోగ్రతలు చేరాయి. ఈ జిల్లాలు ఆరేంజ్‌ జోన్‌లోకి వచ్చాయి. గత సంవత్సరం ఏప్రిల్‌ 28వ తేదీతో పోలిస్తే ఈ ఏడాది 4.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యా. దీన్ని బట్టి ఎండ తీవ్రత ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. బీభత్సమైన ఎండల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డిహైడ్రేషన్‌ ముప్పు ఉంది కాబట్టి తరచూ నీళ్లు తాగాలని, ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలని చెబుతున్నారు.

Updated On 29 April 2024 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story