మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు

మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి ఐదు నిమిషాల గ్రేస్ టైమ్‌ను అధికారులు ఇచ్చారు. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుండగా.. విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగిలినవి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష సమయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.50 వరకు, పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్-2 బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు జరుగుతాయి.

18 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఎస్సేస్సీ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గతంలోలా ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా చూసేందుకు బోర్డు పలు చర్యలు తీసుకుంది. పేపర్ కోడ్, సబ్జెక్టు, మీడియం వంటివి తప్పుగా వచ్చినట్టైతే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులను సంప్రదించాలని బోర్డు సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు సహా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు, విద్య, రెవెన్యూ శాఖల నుంచి ఒక్కో అధికారి, ఒక ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు.

Updated On 13 March 2024 9:48 PM GMT
Yagnik

Yagnik

Next Story