తెలంగాణ రాష్ట్రంలో రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపున‌కు ఈరోజు అర్ధ‌రాత్రితో గ‌డువు ముగియ‌నుంది

తెలంగాణ రాష్ట్రంలో రాయితీపై ట్రాఫిక్ చలాన్ల చెల్లింపున‌కు ఈరోజు అర్ధ‌రాత్రితో గ‌డువు ముగియ‌నుంది. వాహ‌నాల పెండింగ్ చ‌లాన్ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ రాయితీ ప్ర‌క‌టించింది. పెండింగ్ చ‌లాన్ల చెల్లింపుల‌కు గురువారం అర్ధ‌రాత్రి 11:59 గంట‌లకు గ‌డువు ముగియ‌నుంది. గ‌తేడాది డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేసింది ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే రెండుసార్లు ప్ర‌భుత్వం గ‌డువు పొడిగింది. టూ వీలర్స్‌తో పాటు త్రీవీలర్స్ పై 80 శాతం రాయితీని ఇచ్చింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించింది. ఆర్టీసీ బస్సులపై 90 శాతం రాయితీని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక‌పై గ‌డువు పొడిగించ‌బోమ‌ని తెలంగాణ ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. చివరి నిమిషం వరకు ఎదురుచూడకుండా ముందే చలాన్స్ చెల్లించుకోవాలంటున్న ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు.

పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 2023 డిసెంబర్ 27న ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాత పొడిగించుకుంటూ వచ్చారు. అయితే ఎవరైనా పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మళ్లీ డేట్ పొడిగించే అవకాశం లేకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే డిస్కౌంట్ ఆఫర్ డేట్ ను రెండు సార్లు పొడిగించారు. మళ్లీ గడువు పెంచకపోవచ్చని తెలుస్తోంది.

Updated On 14 Feb 2024 11:59 PM GMT
Yagnik

Yagnik

Next Story