హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటూ చేసిన

హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటూ చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు హయాంలోనే దాదాపుగా అన్ని ఆఫీసులు ఏపీకి తరలి వచ్చేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పదేళ్ల పాటు కేటాయించిన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌ వంటి భవనాలను జూన్‌ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి పెండింగ్ అంశాలపై తక్షణమే నివేదికలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పరిష్కారమైన అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు రుణమాఫీపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నెల 18న మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తీ కానుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది.

Updated On 15 May 2024 11:37 PM GMT
Yagnik

Yagnik

Next Story