తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్‌ ప్రసంగానికి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఎసీ అజెండాను టేబుల్‌ చేయనున్నారు.

ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణంగా 6.5 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని.. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం అందించాలన్నారు. ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నల్ల కండువాలు వేసుకుని వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది సభలోకి అనుమతించలేదు.

Updated On 8 Feb 2024 11:27 PM GMT
Yagnik

Yagnik

Next Story