మద్యం(Alcohol) అమ్మకాల్లో తెలంగాణ(Telangana) రికార్డ్‌ సృష్టించింది. 2023లో రూ.36,151 కోట్లకు పైగా విలువైన లిక్కర్‌(Liquor), బీర్‌ను(Beer) మందుబాబులు పీల్చేశారు. 2022 కంటే 2 వేల కోట్లు విలువైన మద్యాన్నిఅధికంగా మద్యం ప్రియులు తాగారు. అత్యధికంగా మద్యాన్ని తాగిన జిల్లాల్లో ఉమ్మడి రంగారెడ్డి(Ranga Reddy), హైదరాబాద్‌(Hyderabad), వరంగల్‌(Warangal) జిల్లాలు నిలిచాయి. రంగారెడ్డి జిల్లాలో రూ. 8,899 కోట్లు విలువైన మద్యాన్ని తాగిన మద్యం ప్రియులు.. హైదరాబాద్‌లో రూ.3,758 కోట్లు.. వరంగల్‌లో రూ.3549.41 కోట్లు విలువైన మద్యాన్ని తాగినట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

2023లో రూ.36,151 కోట్లకుపైగా విలువైన 3.58కోట్ల కేసుల లిక్కర్‌, 5.34 కోట్ల కేసుల బీర్‌ను మద్యం ప్రియులు పీల్చేశారు. 2022లో రూ.34,353 కోట్ల విలువైన 3.58 కోట్ల కేసులు లిక్కర్‌, 4.60 కోట్ల కేసులు బీరును మద్యం ప్రియులు పీల్చేశారు. 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెండు వేల కోట్ల విలువైన మద్యం అధికంగా అమ్ముడుపోయింది. 2023లో జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్‌, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో మాత్రం 3 వేల కోట్ల కంటే తక్కువ విలువైన మద్యం అమ్ముడు పోగా... మిగిలిన 5 నెలల్లో 3 వేల కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఇప్పటి వరకు రూ.36వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చేందుకు అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. డిసెంబర్‌లో రికార్డ్‌ స్థాయిలో అత్యధికంగా రూ.4,297 కోట్ల విలువైన మద్యాన్ని మనోళ్లు తాగారని ఎక్సైజ్‌శాఖ లెక్కలు చెప్తున్నాయి. గత ఏడాదికంటే అధికంగానే ఆదాయం సమకూరుతుందని ఆ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు.

Updated On 3 Jan 2024 6:13 AM GMT
Ehatv

Ehatv

Next Story