ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం జరగనుందా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం జరగనుందా అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు గవర్నర్‌ అనుమతించినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌పై కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ ఇచ్చిన లేఖను గవర్నర్‌ ఆమోదించినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ, ఆర్‌బీఐ అనుమతిలేకుండా రూ.46 కోట్లు బదిలీ చేసినట్లు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్, అప్పటి చీఫ్‌ ఇంజినీర్, కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. అయితే ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. కేటీఆర్‌పై కేసు నమోదు అనుమతి కోసం గవర్నర్‌కు గత నెలలో లేఖ రాసింది. న్యాయసలహాల అనంతరం గవర్నర్‌ అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ అనుమతించింది వాస్తవమే అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Updated On 13 Dec 2024 8:01 AM GMT
ehatv

ehatv

Next Story