తెలంగాణలో పాఠశాలలు తెరుచుకునే వేళయింది. అలాగని రేపో

తెలంగాణలో పాఠశాలలు తెరుచుకునే వేళయింది. అలాగని రేపో.. మాపో అనుకొని టెన్షన్ పడకండి. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది. ఈ విద్యాసంవత్సరం 229 పనిదినాలు కలిగి ఉంటుందని, ఆఖరి రోజు వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నడుస్తాయి.

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగగా.. సెకెండియర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు నిర్వహించనున్నారు.

Updated On 25 May 2024 7:55 AM GMT
Yagnik

Yagnik

Next Story