ఆసియాలో అతి పెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరకు(Medaram Jathara) మునుపెన్నడూ లేనంతగా భక్తులు(Piligrims) తరలివస్తున్నారు. తెలంగాణ(Telangana) కుంభమేళాగా జగద్విఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క(Samakka), సారలమ్మ(Saralamma) మహా జాతర నిన్న అంటే బుధవారం ప్రారంభమయ్యింది.
ఆసియాలో అతి పెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరకు(Medaram Jathara) మునుపెన్నడూ లేనంతగా భక్తులు(Piligrims) తరలివస్తున్నారు. తెలంగాణ(Telangana) కుంభమేళాగా జగద్విఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క(Samakka), సారలమ్మ(Saralamma) మహా జాతర నిన్న అంటే బుధవారం ప్రారంభమయ్యింది. వన దేవతలను దర్శించుకోవడానికి భక్తజనం మొదటిరోజునే భారీగా తరలివచ్చారు. ఇవాళ రెండో రోజు అసలు ఘట్టం ఆవిష్కృతం కానుంది. సమ్మక్క తల్లి ఈరోజు గద్దెపై కొలువు తీరనుంది. ఇవాళ భక్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. చిలకల గుట్ట నుంచి సమ్మక్కను మేడారానికి తీసుకురావడమే ఈ జాతరలో అసలైన ఘట్టం. ఇవాళ కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను తీసుకొస్తారు. గద్దెపై ప్రతిష్టిస్తారు. ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సీతక్క సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్లు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించనున్నారు. మేడారం జన జాతరగా మారింది. గత రాత్రి సారలమ్మతో పాటు సారలమ్మ, పడిగిద్ద రాజు, గోవిందా రాజులు గద్దెపై కొలువుదీరారు. వనదేవతలకు మొక్కు చెల్లించుకునే క్రమంలో జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నెల 24వ తేదీన సమక్క-సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.