తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఇక నుంచి టీజీఎస్‌ఆర్‌టీసీగా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఇక నుంచి టీజీఎస్‌ఆర్‌టీసీగా పిలవనున్నారు. అంతేకాకుండా TGSRTC లోగోను కూడా మార్చనున్నారు. “రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, కార్పొరేషన్‌కు TGSRTC గా పేరు మార్చారు. మరోవైపు కార్పొరేషన్‌ కొత్త లోగోకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా ఖాతాలు కూడా అప్‌డేట్ చేస్తున్నాము" అని టిఎస్‌ఆర్‌టిసి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ఏపీఎస్‌ఆర్‌టీసీని విభజించి టీఎస్‌ఆర్‌టీసీ ఏర్పాటు చేశారు. దశాబ్దం తర్వాత మళ్లీ పేరు మారింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ఆర్టీసీగా మార్చినట్లు ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఈ మేరకు అధికారిక ఎక్స్‌ ఖాతాలైన @tgsrtcmdoffice, @tgsrtchq లను సంస్థ మార్చిందని.. విలువైన సలహాలు, సూచనలతో పాటు ఫిర్యాదులను మార్చిన ఈ ఖాతాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను సజ్జనార్‌ కోరారు. టీజీఎస్‌ఆర్టీసీ అందిస్తోన్న సేవల గురించి తెలుసుకునేందుకు @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాలను ఫాలో అవ్వాలని కోరారు.

Updated On 22 May 2024 10:06 PM GMT
Yagnik

Yagnik

Next Story