కరీంనగర్ బస్టాండ్(Karimnagar) లో ప్రయాణికుల నుంచి టికెట్ పై(Ticket) అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నది ఆర్టీ
దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ(Telangana rtc) ప్రయాణికుల నుంచి టికెట్ రేటు కంటే అదనపు సొమ్ము వసూలు చేసి పండుగ చేసుకుంది. కరీంనగర్ బస్టాండ్(Karimnagar) లో ప్రయాణికుల నుంచి టికెట్ పై(Ticket) అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నది ఆర్టీసీ.సాధారణంగా కరీంనగర్ నుంచి జేబిఎస్ కు 330 రూపాయలు చార్జీ ఉంది. అయితే ఆదివారం దీపావళి రష్ ఉండటం తో ప్రయాణికుల నుంచి 470 వసూలు చేశారు. ఇదేం అన్యాయమని ప్రయాణికులు ప్రశ్నిస్తే ఇదే అసలైన రేటు అని సమాధానం ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉదయం నుంచి కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రద్దీ కి సరిపడని బస్సులు వేయని ఆర్టీసీ వేయలేదు. నాలుగు గంటలు గా బస్సుల కోసం వెయిట్ చేస్తున్న బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు విసుగు చెందుతున్నారు.దీపావళికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఒక వైపు ఆర్టీసీ చెప్తుంటే మరోవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.