ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని(CM Revanth) డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు వి.ల‌చ్చిరెడ్డి ఆధ్వ‌ర్యంలో ప‌లు రెవెన్యూ సంఘాల నాయకులు క‌లిశారు. సోమ‌వారం స‌చివాల‌యంలో(Secretariat) సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి సంద‌ర్భంగా వి.ల‌చ్చిరెడ్డి రాష్ట్రంలో వీఆర్ఏలు ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌ల‌ను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. 5 నెల‌ల‌ వేత‌న బ‌కాయిలు, గుర్తింపు సంఖ్య కేటాయింపు, ఉద్యోగాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ(Regularisation) స‌మ‌యంలో వ‌య‌సు పైబ‌డిన వారు, మృతి చెందిన వారి స్థానంలో వార‌సుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని, త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సీఎంను వారు కోరారు.

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని(CM Revanth) డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు వి.ల‌చ్చిరెడ్డి ఆధ్వ‌ర్యంలో ప‌లు రెవెన్యూ సంఘాల నాయకులు క‌లిశారు. సోమ‌వారం స‌చివాల‌యంలో(Secretariat) సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి సంద‌ర్భంగా వి.ల‌చ్చిరెడ్డి రాష్ట్రంలో వీఆర్ఏలు ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌ల‌ను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. 5 నెల‌ల‌ వేత‌న బ‌కాయిలు, గుర్తింపు సంఖ్య కేటాయింపు, ఉద్యోగాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ(Regularisation) స‌మ‌యంలో వ‌య‌సు పైబ‌డిన వారు, మృతి చెందిన వారి స్థానంలో వార‌సుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని, త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సీఎంను వారు కోరారు. వీటిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ‌, తెలంగాణ‌ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు ఎస్‌.రాములు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌మేష్ పాక‌, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ ఫూల్‌సింగ్ చౌహాన్‌, వీఆర్ఏ సంఘాల ప్ర‌తినిధులు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.

Updated On 1 Jan 2024 7:49 AM GMT
Ehatv

Ehatv

Next Story