తెలంగాణలో(Telangana) ఎండలు(Summer heat) మండిపోతున్నాయి. ఏప్రిల్‌ మాసారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు రాష్ట్రానికి తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పుల(Heat waves) హెచ్చరికలను భారత వాతావరణ శాఖ(IMD) జారీచేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది.

తెలంగాణలో(Telangana) ఎండలు(Summer heat) మండిపోతున్నాయి. ఏప్రిల్‌ మాసారంభంలోనే రాష్ట్రవ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులపాటు రాష్ట్రానికి తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పుల(Heat waves) హెచ్చరికలను భారత వాతావరణ శాఖ(IMD) జారీచేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. వడగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులంబ-గద్వాల జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌(Orange-Alert) జారీ చేసింది. సూర్యాపేట, భద్రాద్రి-కొత్తగూడెం, నల్లగొండ జిల్లాలలో సూర్యుడు నిప్పులను నిమ్ముతున్నాడు.ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మునుగోడు, వేములపల్లి, యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ, బొమ్మలరామారం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా.. సాధారణం కన్నా 6.1 డిగ్రీలు అదనంగా నమోదయ్యింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల వర్ష సూచన ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది. సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, మెదక్‌, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వానలు పడవచ్చు.

Updated On 8 April 2024 1:13 AM GMT
Ehatv

Ehatv

Next Story