అచిరకాలంలోనే యర్రవరం(Yarravaram) ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది. స్వయంభూగా వెలిసిన ఉగ్ర బాల నరసింహస్వామిని(Ugra Bala Narasimha) దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారాలైతే భక్తుల తాకిడి విపరీతంగా ఉంటోంది. స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసం భక్తులలో ఏర్పడింది. అందుకే కోదాడ మండలంలోని యర్రవరం యాత్రాస్థలిలా మారిపోయింది.
అచిరకాలంలోనే యర్రవరం(Yarravaram) ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది. స్వయంభూగా వెలిసిన ఉగ్ర బాల నరసింహస్వామిని(Ugra Bala Narasimha) దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారాలైతే భక్తుల తాకిడి విపరీతంగా ఉంటోంది. స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసం భక్తులలో ఏర్పడింది. అందుకే కోదాడ మండలంలోని యర్రవరం యాత్రాస్థలిలా మారిపోయింది. ఇక భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక(RTC services) సర్వీసులను మొదలు పెట్టింది. ప్రతి రోజు కోదాడలో(Kodada) ఉదయం అయిదు గంటలకు మొది సర్వీసు మొదలవుతుంది. సాయంత్రం ఏడు గంటల వరకు ప్రతీ అరగంటకు ఓ బస్సు సర్వీసు ఉంటుందని డిపో మేనేజర్ శ్రీ హర్ష తెలిపారు. అలాగే హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచ కూడా మధ్యాహ్నం రెండు గంటలకు బస్సు ఉంటుందన్నారు. మళ్లీ తెల్లవారు జామున మూడున్నరకు హైదరాబాద్ బయలుదేరుతుందని చెప్పారు.