డ్రగ్స్‌ను(drugs) అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట ఇవి దర్శనమిస్తూనే ఉన్నాయి.

డ్రగ్స్‌ను(drugs) అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒకచోట ఇవి దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో(Hyderabad) మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. ఓ డాక్టర్(doctor) ఇంట్లో డ్రగ్స్‌ పార్టీకి(drugs party) ప్లాన్‌ చేయగా పక్కా సమాచారంతో చందానగర్‌ పోలీసులు దాడులు చేశారు. రూ.18 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను(MDMA drug) సీజ్‌ చేశారు. రాజస్థాన్‌(Rajasthan) నుంచి డ్రగ్స్‌ తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇది ఇలా ఉండగా ఓ మహిళ తన ఇంట్లో డ్రగ్స్‌ను దాచి నగరంలోని పలువురికి సరఫరా చేస్తుండడంతో అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు జీవీ సలూజా ఆస్పత్రిలో తనిఖీలు చేయగా నార్కొటిక్ డ్రగ్స్‌తో పాటు పలు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో వనస్థలీపురంలో బీటెక్‌ విద్యార్థి పట్టుబడ్డాడు. నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి జాన్‌ వద్ద ఏడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఎండీఎఏను గ్రాము రూ. 2500కు కొనుగోలు చేసి రూ.5వేల చొప్పున అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకున్నా నగరంలో ఎక్కడో ఒక చోట డ్రగ్స్‌ కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి

Eha Tv

Eha Tv

Next Story