ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రగతి భవన్(Pragathi Bhavan )పేరును ప్రజాభవన్ గా మారుస్తామని సంచలన ప్రకటన చేశారు. రేవంత్ చెప్పిన విధంగానే చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వద్ద ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేశారు.

Pragathi Bhavan
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రగతి భవన్(Pragathi Bhavan )పేరును ప్రజాభవన్ గా మారుస్తామని సంచలన ప్రకటన చేశారు. రేవంత్ చెప్పిన విధంగానే చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వద్ద ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేశారు. ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ ను తొలగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పైనుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు జేసీబీలతో బ్యారికేడ్లను తొలగించారు.
ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు. రెండు రోజుల్లో బ్యారికేడ్లను పూర్తిగా తొలగించాలనే ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఫలితాల అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మారుస్తామని చెప్పారు. ప్రగతి భవన్, సెక్రటేరియట్ తలుపులు సామాన్య ప్రజలకు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు.
