కరీంనగర్‌లో మ‌రికాసేప‌ట్లో కాంగ్రెస్ పార్టీ భారీ బ‌హిరంగ‌స‌భ జ‌ర‌గ‌నుంది. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సభకు చత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ హాజరుకానున్నారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ‘యాత్ర ఫర్ చేంజ్’ పాదయాత్రలో భాగంగా ఈ సభ నిర్వహించనున్నారు.

2004 లో కరీంనగర్ లో జరిగిన సభలోనే ఆనాటి యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేశారు. నేడు మళ్లీ అదే కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుండటం ఆసక్తిని రేపుతోంది. ఈ సభకు చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ ముఖ్య అతిధిగా హాజరుకావ‌డం పార్టీ వ్యూహంలో భాగం. చత్తీస్ గఢ్ ప్రభుత్వం రైతులకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కవగా ఇస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ నేతలు, నేటి సభలోనూ ప్రజలకు ఆ విషయాన్ని వివరించనున్నారు. చత్తీస్‌గ‌ఢ్‌లో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వరి క్వింటాల్‌కు 2,500 రూపాయ‌ల మద్దతు ధర చెల్లిస్తోంది. 30 యూనిట్ల విద్యుత్ ఉచితం అందిస్తుండగా, 400 యూనిట్ల విద్యుత్ బిల్లులో సగమే కట్టే హాప్ బిజిలీ పథకాన్ని కూడా చత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు కరీంనగర్ లో జరిగే ఈ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫిబ్రవరి 6 న రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన తరువాత కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నమొదటి సభ కావడంతో క్యాడ‌ర్‌లో ఆస‌క్తి పెరిగింది. స‌భ‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

Updated On 9 March 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story