ఏప్రిల్ 30వ తేదీన‌ తెలంగాణ నూత‌న‌ సచివాలయ భ‌వ‌న స‌ముదాయాన్ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఆరోజు ఉద‌యం ఆరు గంట‌ల త‌ర్వాత‌ సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభమ‌వుతుంది. మధ్యాహ్నం 1:20 నుంచి 1:30 నిమిషాల మధ్య పూర్ణాహుతి కార్య‌క్ర‌మం ఉంటుంది. అనంత‌రం నూత‌న‌ సచివాలయ భ‌వ‌నాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభిస్తారు సీఎం కేసీఆర్‌.

ఏప్రిల్ 30వ తేదీన‌ తెలంగాణ నూత‌న‌ సచివాలయ భ‌వ‌న (Telangana New Secretariat ) స‌ముదాయాన్ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఆరోజు ఉద‌యం ఆరు గంట‌ల త‌ర్వాత‌ సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభమ‌వుతుంది. మధ్యాహ్నం 1:20 నుంచి 1:30 నిమిషాల మధ్య పూర్ణాహుతి కార్య‌క్ర‌మం ఉంటుంది. అనంత‌రం నూత‌న‌ సచివాలయ భ‌వ‌నాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభిస్తారు సీఎం కేసీఆర్‌. ఆ త‌ర్వాత స‌చివాల‌యం 6వ అంతస్తులోని తన ఛాంబర్లో కొలువుదీరుతారు ముఖ్య‌మంత్రి. మంత్రులు కూడా వారికి కేటాయించిన‌ ఛాంబర్లలో కొలువుదీరుతారు.

మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్ ఉంటుంది. గ్యాదరింగ్ ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ (CM KCR) ప్రసంగిస్తారు. ఆ తరువాత అధికారులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం తమతమ స్థానాల్లో కొలువుదీరుతారు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి సమీకృత కొత్త పరిపాలనా సౌధం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆ రోజు నుంచే సీఎం కేసీఆర్‌, సీఎంఓ అధికార యంత్రాంగం, మంత్రులు నూత‌న స‌చివాల‌యం నుంచి పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తారు.

Updated On 26 April 2023 7:50 AM GMT
Ehatv

Ehatv

Next Story