తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(TS Elections) బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం ఓడిపోయింది. బీఆర్‌ఎస్ పరాజయానికి పలు కారణాలున్నాయి. అందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barage) పిల్లర్లు కుంగిపోవడం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(TS Elections) బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం ఓడిపోయింది. బీఆర్‌ఎస్ పరాజయానికి పలు కారణాలున్నాయి. అందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barage) పిల్లర్లు కుంగిపోవడం.. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న మంచి పేరు అంతా పోయింది. అసలు మేడిగడ్డ బ్యారేజ్‌కు ఏమైంది? అన్నది తెలుసుకోవడానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), శ్రీధర్‌బాబు(Sridhar babu), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas) ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఏరియల్ సర్వే చేస్తారు. తర్వాత మేడిగడ్డ డ్యామ్ 19, 20,21 పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో పరిశీలిస్తారు.
ఈ పిల్లర్లు కుంగిపోవడం వల్ల తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచి పోవడానికి గల కారణాలను తెలుసుకుంటారు. అలాగే, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇందు కోసం నీటి పారుదల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.