జమ్ముకశ్మీర్‌లో గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన జవాన్ పబ్బాల అనిల్ మృతిచెందాడు. పబ్బాల అనిల్ స్వగ్రామం సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ గ్రామం. అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు.

Telangana Minister Kalvakuntla Taraka Ramarao Pays Tribute To Army Jawan Anil
జమ్ముకశ్మీర్(Jammu Kashmir)లో గురువారం జరిగిన హెలికాప్టర్(Helicopter) ప్రమాదం(Accident)లో రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లాకు చెందిన జవాన్ పబ్బాల అనిల్(Pabbala Anil) మృతిచెందాడు. పబ్బాల అనిల్ స్వగ్రామం సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి(Boinpalli) మండలం మల్కాపూర్(Malkapur) గ్రామం. అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ (Minister KTR) తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో యువ జవాన్‌ని కోల్పోవడం బాధాకరమన్నారు. అనిల్ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్(KTR) ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. జమ్ముకశ్మీర్ కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ముగ్గురిలో అనిల్ మృతి చెందగా.. మిగతా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బాల లక్ష్మి-మల్లయ్య(Laxmi-Mallaiah) దంపతులకు ముగ్గురు కొడుకులు కాగా.. అనిల్ చిన్న కొడుకు. 2011లో ఆర్మీలో చేరి టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. అనిల్‌కు భార్య సౌజన్య(Sowjanya), కొడుకులు ఆయాన్(Ayan), అరవ్(Arav) ఉన్నారు. అనిల్ మరణంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొన్నది.
