Britain Elections : బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ యువకుడు!
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో(Britain Parliament elections) తెలంగాణ(Telangana) బిడ్డ బరిలో దిగుతున్నాడు. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా కోహెడ(Koheda) మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ కాండిడేట్ గా పార్టీ పక్రటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ బౌండరీకమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం.

Britain Elections
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో(Britain Parliament elections) తెలంగాణ(Telangana) బిడ్డ బరిలో దిగుతున్నాడు. ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా కోహెడ(Koheda) మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ కాండిడేట్ గా పార్టీ పక్రటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ బౌండరీకమిషన్ సూచనతో కొత్తగా ఏర్పడ్డ పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ లేబర్ పార్టీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇదే ఏడాది బ్రిటన్, అమెరికాలలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. నాగరాజు హనుమంతరావు, నిర్మలాదేవి దంపతులకు జన్మించిన ఉదయ్ నాగరాజుది కష్టపడే మనస్తత్వం. చురుకైన విద్యార్థిగా పేరుసంపాదించుకున్నాడు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆప్ లండన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఉదయ్ మంచి వక్త. రచయిత కూడా! ఉదయ్ ఎన్నికలలో విజయం సాధించి బ్రిటన్ పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని కోరుకుందాం!
