☰
✕
మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు చేపట్టిన తనిఖీలలో తెలంగాణలో రూ.333.55 కోట్ల నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
x
మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు చేపట్టిన తనిఖీలలో తెలంగాణలో రూ.333.55 కోట్ల నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.76 కోట్ల విలువైన 30 లక్షల లీటర్ల మద్యం, రూ.114 కోట్ల నగదు, రూ.29 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.77 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలు వంటి విలువైన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.8,889 కోట్ల మేర జప్తు చేసినట్లు భారత ఎన్నికల సంఘం నివేదిక పేర్కొంది. తెలంగాణాలో రూ.36 కోట్ల విలువైన ఇతర ఉచితాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది.
Yagnik
Next Story