తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మొదలైంది
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మొదలైంది. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ లో పాల్గొనేందుకు దాదాపు 10,000 మంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక హాళ్లలో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.
మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి స్ట్రాంగ్‌రూమ్ భద్రత కోసం 12 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోలైన ఓట్ల లెక్కింపు కూడా జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మే 13న 17 లోక్‌సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరిగింది.