ఇక దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులలో మూడో వంతు దాడులు ఆమె భర్త , బంధువులు చేస్తున్న దాడులే కావడం గమనార్హం.. మహిళలపై జరుగుతున్న దాడులలో లక్షల్లో కేసులు నమోదు అవుతుంటే, పరిష్కారం అవుతున్న కేసులు మాత్రం వేలల్లోనే ఉంటున్నాయి. 2021 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 21.22 లక్షల కేసులు కోర్టులలో ఉంటే ఇప్పటివరకు దేశంలో పరిష్కృతమైన కేసులు 83,536 మాత్రమే. ఇక ఈ కేసుల విషయంలో కోర్టులు మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందని కూడా సర్వే నివేదిక వెల్లడించింది.

దేశంలో మహిళలపై దాడులు ఆగడం లేదు. ఏడాదికి ఏడాదికి మహిళలపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. ఎన్ని కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన మహిళలపై నేరాలకు అంతులేకుండా పోతోంది. మహిళల పట్ల ప్రత్యేకమైన భద్రతా చర్యలను ప్రభుత్వం చేపట్టినప్పటికీ దాడులు పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అయితే మన దేశంలో గృహహింస ( Domestic Violence)కేసులు ఎక్కువ అనే చెప్పుకోవాలి. ఈ కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అయితే లాక్ డౌన్ ( Lock down ) సమయంలో ఈ గృహహింస కేసులు కూడ ఎక్కువ అయ్యాయని సర్వే తెలిపింది.

అయితే భారతదేశంలో గృహహింస ( Domestic Violence)కేసులకు సంబంధించి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో విస్తుపోయే విషయాలను వెల్లడించింది. విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2022 సర్వే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో గృహహింస కేసుల జాబితాలో 75% గృహహింస కేసులతో అస్సాం రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది... 50.4% తెలంగాణ (Telangana ) ) రెండవ స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. 48.9%తో ఢిల్లీ మూడవ స్థానంలో నిలిచాయి. ఇక దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులలో మూడో వంతు దాడులు ఆమె భర్త , బంధువులు చేస్తున్న దాడులే కావడం గమనార్హం.. మహిళలపై జరుగుతున్న దాడులలో లక్షల్లో కేసులు నమోదు అవుతుంటే, పరిష్కారం అవుతున్న కేసులు మాత్రం వేలల్లోనే ఉంటున్నాయి. 2021 సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా 21.22 లక్షల కేసులు కోర్టులలో ఉంటే ఇప్పటివరకు దేశంలో పరిష్కృతమైన కేసులు 83,536 మాత్రమే. ఇక ఈ కేసుల విషయంలో కోర్టులు మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందని కూడా సర్వే నివేదిక వెల్లడించింది. 2015 - 2016 లో 33.3% గృహహింస కేసులు ఉండగా, 2019 2021 నాటికి ఇవి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మళ్లీ ఇప్పుడు ఈ కేసులు (cases) పెరుగుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనా నమోదైన కేసులు త్వరిత గతిన పరిష్కరించాల్సిన అవసరం మాత్రమే కాదు, గృహ హింస కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేసి అందుకు తగిన పరిష్కార మార్గాలు చూస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఈ నివేదికతో వ్యక్తం అవుతుంది.

Updated On 23 March 2023 1:38 AM GMT
Ehatv

Ehatv

Next Story