తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 (TSPSC Group-1)ప్రిలిమ్స్(Prelims exam) రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) మంగళవారం విచారణ జరిగింది. దీనికి సంబంధించిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన టీఎస్‌పీఎస్సీ(TSPSC)..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 (TSPSC Group-1)ప్రిలిమ్స్(Prelims exam) రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) మంగళవారం విచారణ జరిగింది. దీనికి సంబంధించిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన టీఎస్‌పీఎస్సీ(TSPSC).. వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. సోమవారం వరకూ ఫలితాలు ప్రకటించవద్దని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఎస్‌యూఐతో(NSUI) పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 పరీక్ష స‌మ‌యంలో బయోమెట్రిక్ పెట్టలేదని పిటీషన్ లో పేర్కొన్నారు. ఒక వైపు పిటీషన్ విచారణలో ఉండగా.. త్వరలో గ్రూప్-1 ఫలితాలు ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ యోచిస్తుందని పిటీషనర్లు కోర్టుకు తెలిపారు. ఫలితాలు ప్రకటించకుండా స్టే ఇవ్వాలని పిటీషనర్లు కోర్టును కోరారు.

Updated On 25 July 2023 6:50 AM GMT
Ehatv

Ehatv

Next Story