కోర్టుకు హాజరవుతారా? జైలుకు పంపమంటారా? అంటూ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha)పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టుకు హాజరవుతారా? జైలుకు పంపమంటారా? అంటూ సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha)పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు కోర్టు ఆర్డర్ ఇల్లీగల్ అంటూ బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్. తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. తన ఇల్లు మిడ్ మానేరులో పోయిందని ఆర్అండ్ఆర్(R&R) చట్టం ప్రకారం తనకు పునరావాసం కల్పించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రాజన్నసిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla District)అనుపురం(Anupuraram) గ్రామానికి చెందిన వనపట్ల కవిత (Vanapatla Kavita )అనే నిర్వాసితురాలు. సుదీర్ఘ కాలం విచారణ అనంతరం కవితకు అర్అండ్ఆర్ ప్యాకేజి ప్రకారం పునరావాసం కల్పించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం. కోర్టు తీర్పు తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరిన బాధితురాలు. కోర్టును తప్పుతోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో పిటిషనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వేములవాడ (Vemulawada)ఆర్డీవో(RDO)కు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్. కలెక్టర్ ఆదేశాలతో బాధితురాలు కవితపై క్రిమినల్ కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై తిరిగి న్యాయస్థానాన్ని కవిత ఆశ్రయించింది. కోర్టు తీర్పును ధిక్కరించండమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసు నమోదు చేయడంపై సీరియస్ అయిన హైకోర్టు. కలెక్టర్‌ను కోర్టుకు అటెండ్ కావాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. నిన్న ఉదయం కోర్ట్ కి హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరైన కలెక్టర్, మధ్యాహ్నం వరకు కోర్టులో ఉండకపోతే జైలుకు పంపుతామని ప్రభుత్వ తరపు న్యాయవాదికి చెప్పిన న్యాయమూర్తి. మధ్యాహ్నం కోర్టుకు హాజరైన కలెక్టర్, 2 గంటల పాటు కోర్టులో నిల్చోపెట్టి తీవ్ర స్థాయిలో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తప్పు అని ఎలా అంటారు, బాధితురాలిపై కేసు ఎలా నమోదు చేస్తారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కలెక్టర్ ను అడిగిన న్యాయస్థానం. తాము మాట్లాడిన మాటలు తప్పేనని ఒప్పుకొని బేషరతుగా కలెక్టర్ క్షమాపణ కోరారు. క్షమాపణ చెప్పినా బాధితురాలిపై కేసు నమోదు చేయించిన ఘటనలో చర్యలకి సిద్ధంగా ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు సమయం ముగియడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.
