ఫార్ములా ఈ రేస్ కేసులో ఈనెల 30 వరకు వారం వరకు అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆదేశించింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఈనెల 30 వరకు వారం వరకు అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ-రేస్‌లో విచారణ కొనసాగించవచ్చన్న హైకోర్టు. విచారణకు కేటీఆర్ సహకరించాలన్న హైకోర్టు
ఏసీబీ పెట్టిన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు కేటీఆర్. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్‌పై నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవని లాయర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా కేటీఆర్‌పై కేసు నమోదు చేశారంటూ లాయర్ తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్‌కు ప్రయోజనమే కలిగిందని లాయర్ అన్నారు. స్పాన్సర్ తప్పుకోవడం వల్ల హెచ్ఎండీఏ ద్వారా FEO కు చెల్లింపులు జరిగాయని కేటీఆర్ లాయర్ కోర్టుకు చెప్పారు. మరోవైపు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో, అగ్రిమెంట్ లేని సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు బదిలీ చేశారని ఏజీ వాదించారు.