తెలంగాణ హైకోర్టు(TS High Court) కీలక తీర్పునిచ్చింది. బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎పై(KCR) కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్(Naveen Mittal), ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‎కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మరో పిటిషన్‎తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో(Kokapet) 11 ఎకరాల స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. కోకాపేటలో సర్వే నెం. 239, 240లో ఉన్న 11 ఎకరాల స్థలాన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం కేటాయిస్తూ గత ఏడాది ఒక మెమో (నెం. 12425) లాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది. అప్పటి రంగారెడ్డిజిల్లా కలెక్టర్ ఒక్కో ఎకరానికి రూ. 3.42 కోట్ల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలకు రూ. 37.53 కోట్ల మేర ధరను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఈ భూమి ధర మొత్తం రూ. 1100 కోట్ల మేర ఉంటుందని, అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారన్నది పిటిషనర్ ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌.. చీఫ్ జస్టిస్ జస్టిస్‌ ఆలోక్‌ అరాధే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. తాజా విచారణలో పిటిషనర్ తరఫున, బీఆర్ఎస్ తరఫున హాజరైన న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధినేత కేసీఆర్, అప్పటి ప్రధాన కార్యదర్శి, అప్పటి రెవెన్యూ సెక్రటరీ, బాధ్యులైన మరికొద్దిమంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Updated On 25 Jan 2024 4:51 AM GMT
Ehatv

Ehatv

Next Story