మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు(Srinivas Gouwd) హైకోర్టులో చుక్కెదురైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటీషన్‌ను హైకోర్టు(High Court) కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లందంటూ ఓ ఓటర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Minister Srinivas Goud
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు(Srinivas Goud) హైకోర్టులో చుక్కెదురైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటీషన్‌ను హైకోర్టు(High Court) కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లందంటూ ఓ ఓటర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్(Afidavit) లో తప్పుడు దృవ పత్రాలు సమర్పించారని.. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని మహబూబ్ నగర్‌కు(Mahabub Nagar) చెందిన ఓటర్ రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో కౌంటర్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. రాఘవేంద్రరావు(Raghavendra Rao) పిటిషన్ ను మాత్రం స్వీకరించింది.
