దుర్గం చెరువు(Durgam cheruvu) పరిసరాల్లో నివాసం ఉంటున్న వారికి హైకోర్టులో(High court) ఊరట లబించింది
దుర్గం చెరువు(Durgam cheruvu) పరిసరాల్లో నివాసం ఉంటున్న వారికి హైకోర్టులో(High court) ఊరట లబించింది. దుర్గం చెరువు కూల్చివేతలపై సోమవారం స్టే ఆదేశాలు(Saty orders) జారీ చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కూల్చివేతలు ఆపేయాలని స్టే ఆర్డర్స్ జారీ చేసింది. అలాగే అక్టోబర్ 4వ తేదీన లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని ఆదేశించింది. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4వ తేదీ నుంచి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట లభించినట్లయ్యింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్న అనుముల తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఇక్కడే ఉంది కాబట్టే కోర్టును ఆశ్రయించడానికి 30 రోజుల నోటీసు ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.