నటుడు రాజ్‌తరుణ్(Raj tharun)- లావణ్య(Lavanya) ప్రేమ వ్యవహారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
నటుడు రాజ్‌తరుణ్(Raj tharun)- లావణ్య(Lavanya) ప్రేమ వ్యవహారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ కేసులో రాజ్‌తరణ్‌కు తెలంగాణ హైకోర్టు(TS High court) ముందస్తు బెయిల్(anticipatory bail) మంజూరు చేసింది. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం రాజ్‌తరుణ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఇక లావణ్యకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్విస్ట్ ఏంటంటే రాజ్‌తరుణ్‌తో పెళ్లి జరిగినట్లు ఆధారాలు ఉంటే కోర్టు ముందు ఉంచాలని సూచించింది. లావణ్య ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో కనీసం పెళ్లి శుభలేఖ అయినా ఉందా అని ధర్మాసనం అడిగింది. దీంతో ఆధారాలు సేకరించేందుకు తమకు సమయం కావాలని లావణ్య తరపు న్యాయవాది కోరాడు. మరోవైపు రాజ్‌తరుణ్ తరఫు లాయర్ వాదిస్తూ.. లావణ్య గత చరిత్ర సరిగా లేదన్నారు. హీరో రాజ్‌తరుణ్ 30కి పైగా సినిమాలు చేశాడని, అతనిపై ఇంత వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. లావణ్య ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. దీంతో కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.