తెలంగాణ హైకోర్టు(Telangana Court) మంగ‌ళ‌వారం సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం(Kothagudem) ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు(Vanama Venkateswara Rao) ఎన్నిక చెల్ల‌దంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును(Jalagam venkta rao) ప్రకటిస్తూ సంచ‌ల‌న తీర్పు వెలువరించింది.

తెలంగాణ హైకోర్టు(Telangana Court) మంగ‌ళ‌వారం సంచలన తీర్పును వెల్లడించింది. కొత్తగూడెం(Kothagudem) ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు(Vanama Venkateswara Rao) ఎన్నిక చెల్ల‌దంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును(Jalagam venkta rao) ప్రకటిస్తూ సంచ‌ల‌న తీర్పు వెలువరించింది. 2018 ఎన్నిక‌ల‌లో త‌న‌పై గెలిచిన వనమా వెంకటేశ్వరరావు గెలుపును సవాలు చేస్తూ జలగం వెంకట్రావు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్ లో వ‌న‌మా వెంకటేశ్వరరావు తప్పుడు వివ‌రాలు ఇచ్చారంటూ జలగం వెంకట్రావు తన పిటీష‌న్‌లో పేర్కొన్నారు.

జలగం వెంకట్రావు పిటీష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు.. సుదీర్ఘంగా విచారించిన త‌దుప‌రి వ‌నమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. రెండ‌వ స్థానంలో నిలిచిన‌ జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన వనమా వెంకటేశ్వరరావుకు ఐదు లక్షల జరిమానా విధించింది. 2018 నుండి ఇప్పటివరకూ ఎమ్మెల్యే ప‌ద‌వీకాలం చెల్ల‌ద‌ని తీర్పులో వెల్ల‌డించింది. ఇదిలావుంటే.. 2018లో కాంగ్రెస్ అభ్య‌ర్దిగా గెలిచిన వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు.. ఆ త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.

Updated On 25 July 2023 7:07 AM GMT
Ehatv

Ehatv

Next Story