తెలంగాణ(Telangana) ఇప్పుడు నెంబర్ వన్ లో ఉన్నది ఒక్క మద్యం అమ్మకాలలోనే

తెలంగాణ(Telangana) ఇప్పుడు నెంబర్ వన్ లో ఉన్నది ఒక్క మద్యం అమ్మకాలలోనే(alcohol purchase) కావడం కాసింత బాధ కలిగించే విషయం అయినా వాస్తవాన్ని ఒప్పుకోవాలి. మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండటంతో తెలంగాణ మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. రోజూ లక్షల లీటర్లలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. లిక్కర్ అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉంది. తెలంగాణలో ఒక్కొక్కరు 1623 రూపాయలను మద్యం కోసం ఖర్చు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కరు మద్యానికి 1,306 రూపాయలు ఖర్చు చేసినట్లు ఓ సర్వేలో తెలిసింది. ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (NIPFP) ఈ సర్వే చేసింది. మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 చొప్పున ఒక్కొక్క వ్యక్తి లిక్కర్ కోసం ఖర్చు చేస్తున్నారు.బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్‌లో జనం తక్కువ తాగుతున్నారు. ఇక తెలంగాణలో మొత్తం 2,620 వైన్స్‌ షాపులు, వెయ్యికిపైగా బార్స్‌, పబ్స్‌ ఉన్నాయి. దసరా పండుగ సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యికోట్లపైగా విలువైన లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. 11లక్షల కేసుల మద్యం, 18లక్షల కేసుల బీర్స్‌ అమ్మకాలు జరిగాయట. ఇక దక్షిణ భారతదేశంలో బీర్ల విక్రయాలు అత్యధికంగా తెలంగాణలో అమ్ముడవుతున్నట్లుగా సర్వేలో తేలింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 302.84 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. ఏపీలో 169 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి.

Eha Tv

Eha Tv

Next Story