యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ(Sri Lakshmi Narasimha Swamy Temple) భద్రతపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రత్యేకంగా దృష్టి సారించింది.. ఆలయానికి పోలీస్ భద్రత పెంచింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తరహాలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది..ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బందికి తోడు, మరి కొంతమందిని నియమించింది..ఆలయ భద్రతకు నియమించిన పోలీసు సిబ్బంది విధుల్లో చేరారు..

Yadadri Temple
యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ(Sri Lakshmi Narasimha Swamy Temple) భద్రతపై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆలయానికి పోలీస్ భద్రత పెంచింది. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తరహాలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది...ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బందికి తోడు, మరి కొంతమందిని నియమించింది..ఆలయ భద్రతకు నియమించిన పోలీసు సిబ్బంది విధుల్లో చేరారు.. ఆలయ భద్రత చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇటీవలే ఏసీపీ స్థాయి అధికారితో పాటు టీఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా ప్రత్యేకంగా నియమించింది.. తాజాగా ఓ ఇన్స్పెక్టర్ తో పాటు నలుగురు ఏఎస్ఐలు,11 మంది హెడాకానిస్టేబుళ్లు, 17మంది కానిస్టేబుళ్లను యాదగిరిగుట్టకు బదిలీ చేస్తూ టీఎస్పీఎఫ్ డీజీ ఇటీవల ఉత్తర్వులు జారీచే శారు..ఇందులో భాగంగా యాదగిరిగుట్టలో నిఘా వ్యవస్థను కూడా పటిష్ఠం చేస్తున్నారు.. పట్టణంతోపాటు కొండపై ప్రతీ కోణంలో సీసీ కెమెరాలు, గుట్టపైకి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి స్కానర్లు,మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నారు... ఇక్కడ విధులు నిర్వహించే పోలీసులకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చనున్నారు.
