తెలంగాణ(Telngana)లో సీఎం రేవంత్‎రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల(Government Advisers) నియామకాలను రద్దు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Santhi Kumari)..ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురి సలహాదారుల నియామకాలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ(Telngana)లో సీఎం రేవంత్‎రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల(Government Advisers) నియామకాలను రద్దు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Santhi Kumari)..ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఏడుగురి సలహాదారుల నియామకాలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మైనారిటీ వెల్ఫేర్‎కు ప్రభుత్వ సలహాదారుడు - ఏకే ఖాన్​, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు - సోమేశ్​ కుమార్​, వ్యవసాయ వ్యవహారాలపై ప్రభుత్వ సలహాదారుడు చెన్నమనేని రమేశ్​, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్​ శర్మతోపాటు మరో ముగ్గురు ప్రభుత్వ సలహాదారులు అనురాగ్​ శర్మ, జీఆర్​ రెడ్డి, .ఆర్.శోభ నియామకాలను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

ముఖ్య‌మంత్రి రేవంత్‎రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వ‌రుస స‌మావేశాల‌తో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​ కుమార్​ రాజీనామా చేయగా, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు భరత్​ కుమార్​, జూలూరి గౌరీ శంకర్​, పల్లె రవి కుమార్​ గౌడ్​, ఆంజనేయ గౌడ్​, దూది మెట్ల బాలరాజు యాదవ్​, గూడూరు ప్రవీణ్​, అనిల్​ కూర్మాచలం, వలియా నాయక్​, వై. సతీశ్​ రెడ్డి, మేడె రాజీవ్​ సాగర్​, రవీందర్​ సింగ్​, ఎర్రోళ్ల శ్రీనివాస్​, పాటిమీది జగన్మోహన్‎రావు తదితరులు తమ పదవులకు రాజీనామా చేశారు.

ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్‎రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు
తెలంగాణ ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీగా ఉన్న ప్రభాకర్​రావు రాజీనామా చేశారు. అలాగే ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్​ అధ్యక్షులుగా ఉన్న కేవీ రమణాచారి, టాస్క్​ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‎రావు, శాతవాహన అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఛైర్మన్​ సైతం ఇప్పటికే తమ రాజీనామా లేఖలను సమర్పించారు.

Updated On 9 Dec 2023 6:21 AM GMT
Ehatv

Ehatv

Next Story