లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు ఉద్యోగులను అనుమతించేందుకు తెలంగాణ ప్రభుత్వం మే 13, జూన్ 4 తేదీల్లో వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది

లోక్‌సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు ఉద్యోగులను అనుమతించేందుకు తెలంగాణ ప్రభుత్వం మే 13, జూన్ 4 తేదీల్లో వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న ఒకే దశలో జరగనున్నాయి. మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది.

రాష్ట్రంలో వేడిగాలుల కారణంగా 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక గంట పొడిగించారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో భాగమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మే 13న పోలింగ్ ఉంది. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

ఎన్నికల కోసం 3,986 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయ‌గా.. 23,500 మంది ఉద్యోగులను ఎన్నికల సిబ్బందిగా నియమించింది. అవగాహన కార్యక్రమాల ద్వారా ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Updated On 6 May 2024 11:06 PM GMT
Yagnik

Yagnik

Next Story