కొత్తగా ఏర్పాటైన రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది.
కొత్తగా ఏర్పాటైన రేవంత్‌రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ చైర్మన్ల(Corporation Chairmans) నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు నియామకాలను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో 54 మంది కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఉన్న సమయంలో ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారడంతో ఇప్పటికే పలు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. ప్రభుత్వం మరో 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది.