తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి(Mahendra reddy) నియామకాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Tamilasai) ఆమోదించారు.
టీఎస్‌సీఎస్‌సీ సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అనితా రామచంద్రన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వ సిఫారసులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి(Mahendra reddy) నియామకాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Tamilasai) ఆమోదించారు.
టీఎస్‌సీఎస్‌సీ సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అనితా రామచంద్రన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ప్రభుత్వ సిఫారసులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ విషయమై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు(Bhatti vikramarka) నిన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో భేటీ అయ్యారు. రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని గవర్నర్‌ను ఆహ్వానించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియామకాన్ని ఆమోదించాలని కోరారు.
బీఆర్‌ఎస్(Brs) అధికారంలో ఉన్నప్పుడు టీఎస్‌పీఎస్సీ పరీక్షల లీక్ స్కాం వెలుగులోకి వచ్చింది. 2023 మార్చిలో పేపర్ల లీక్ వ్యవహరం వెలుగు చూసింది. గత ఏడాది నవంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీఎస్‌ఎస్సీని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యూపీఎస్‌సీ తరహాలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ గా పనిచేసిన జనార్థన్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు రాజీనామాలు సమర్పించారు. ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. దీంతో కొత్తగా చైర్మన్ పదవి కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ దరఖాస్తులను వడపోసి మహేందర్ రెడ్డిని నియమించింది. మహేందర్ రెడ్డి నియామాకానికి గవర్నర్ ఆమోదం